﻿పౌల్‍ తిమోతినా లిఖ్యొతె అగాడీను పుస్తక్‍.
1.
అప్నో బఛ్చావాలొహుయోతె దేవ్నుబాజుతీ అప్ను ఆహ్ఃహుయోతే క్రీస్తుయేసును ఆజ్ఞా ప్రకారంతీ క్రీస్తుయేసునూ అపొస్తల్‍హుయోతె పౌల్‍, 
విష్వాస్‍నా పట్టీన్‍ మరో హాఃఛెలొ ఛియ్యోహుయోతే తిమోతినా అషల్‍కరి బోలిన్‍ లిఖ్యొతె. భా హుయోతే దేవ్‍కంతూ అప్నొ ప్రభుహుయోతే యేసుక్రీస్తు కంతూబి కృపబి, గోర్‍బి, సమాధానంబీ తునా కల్గదా హువదా. 
మే మాసిదోనియానా జంకరమా తెదె హాఃఛినాబదుల్‍ ఛాడ్‍నుబోధ నొకొకరోకరి, కల్పనా ఖేణినా మితంకొయింతే ఖాందాన్‍, 
విష్వాస్‍ సంభంధహుయూతె దేవ్ను ఏర్పటుతి కాహేతిమ్‍ వివాదంతీస్‍ సంబంధంహుయీన్‍ ఛా. అనటేకే థోడుజణనా ఆజ్ఞాదేవానటేకె తూ ఎఫెసుమా ఉబ్బిరి ర్హానుకరి తునా గుర్కాయా ప్రకారం హంకేబీ గుర్కాంకరియేస్‍. 
ఉదేషంసారంసం సాత్‍కతో పవిత్ర్ దిల్‍మతూ, అష్యల్‍ను మనసాక్చిమతూ, కపటంకోయినితే విష్వాస్‍మతూ ఆవతే ఫ్యార్‍. 
థోడుజను అనా బెందీన్‍ నికిజైయిన్, ఇవ్నెబోలతె ఇనాతోబి, 
నిష్చయమైహుయూతె కఛ్చితంతి బోలతె వాతేనతోబి గ్రహించకొయింతే ధర్మషాస్ర్తంనా బోలవాలొహుయిన్‍ ర్హానుకరి సోఛ్చిన్‍, ఫాల్తూహుయూతె ముచ్చటనాబాజు పర్యూ. 
హుయితోబి స్రీమంతుడ్‍ దేవ్నుమహిమనూ ఆసీర్వాద్‍వాలొ హుయోతే దేవ్‍ మన దీరాక్యోతె ఇను మహీమను సువార్త ప్రకారంతీ, 
ధర్మషాస్త్రం పాప్‍వాలు అద్మియోనటేకె కోదెవాయ్‍రూని కరి హఃయాల్‍ కర్లేవొ, అవిధేయుల్నాబి, భక్తిహీనుల్నా, పాపిష్టుల్‍నా, అపవిత్రుల్‍నా, జాత్నా దూషణకరతే అద్మినా మర్రాఖవాలనాబి ఆయానా, భా మర్రాఖవాలనబీ, అద్మినామారతె, ఇవ్నా ఆ అషల్ కాహె, 
బుజు వ్యభిచార్‍బీ మరద్మానా వ్యభిఛారంకరవాలనబి, అద్మియేనా చోర్‍కరవాలనాబి ఛాడ్‍బోలవాలనబి హాఃఛి బోధనా విరోధంతి బోలవాలు బుజు కోన్బి ర్హయ్యొతొతెదె, నియమించబడ్యూ. 
నీతిమంతునా నియమి‍ంచబడ్యూకొయిని కరి కోన్బి మాలంకరీన్‍, ధర్మంరీతిగా ఇనా ఉపయోగించొతెదె ధర్మాషాస్త్రం ఘనమ్‍హుయూతెకరి అప్నే మాలంకర్సూ. 
మనా బలపర్చీన్‍ భరోసా వలానితర ఎంచీన్‍ ఇను సేవన నియామించోతె అప్నొ ప్రభుహుయోతే క్రీస్తు యేసునా కృతజ్ఞుడ్‍హుయిన్‍ చౌవు, 
సానకతో ఇనేహుః అగాడి దూషణ్‍వాలొ, హింసదెవ్వాలో, హానికరుడ్‍వ్వాలో, వుజు మాలంకోయినితే దేవ్నా అవిష్వాస్‍న కర్యొథోబి మే మన మాలం కొయినితిమ్‍ కర్యొతే ఇనటేకె దేవ్‍ మన గోర్‍ పొంద్యొ. 
బుజు అప్నొ ప్రభును కృపబి, క్రీస్తుయేసుమా చాతే విష్వాస్‍బి ఫ్యార్‍బి, జాహఃత్‍ ఫైలాయు. 
మే హాఃచిస్‍ బోలుకురుస్‍ పాప్‍వాలనా బఛ్చావనాటేకె క్రీస్తు యేసు ములక్‍మా ఆయోకరి వాక్యం నమ్మకంనుహువనబీ, పూర్ణధికారంన యోగ్యంహుయీన్‍ ఛా, కరి ఏజాత్నుమా మే ప్రధానుడ్‍. 
హుయితోబి నిత్యజీవంనా నిమిత్తం ఇనా విష్వాస్‍సించతే వాలనా మే మాదిరినీతరా ర్హానుతిమ్‍ యేసుక్రీస్తు ఇను పరిపూర్ణనం హుయితే దీర్ఘసాంతంనా యో ప్రధానా పాపిహుయోతే మారమా వతాల్యావ హఃర్కు మే గోర్‍హుయోతొ. 
హాఃరు యుగాల్మాబీ రాజోనితరా ర్హయిన్‍ మఠకొయింతె మాయంహువాలొ ఏక్నాయేక్‍ అద్వితీయుడ్‍ దేవ్నా ఘనతాబి మహిమాబీ పిఢిపిఢినా కల్గును హువదా! ఆమేన్‍. 
మారో ఛియ్యోహుయోతె తిమోతి, తూ విష్వాసంనా అష్యల్‍ను మనస్‍సాక్చి హుయిన్‍ తునాలీన్‍ అగాడి బోల్యొతె ప్రవచనలీన్‍ ఆ అషల్ లడైయికర్కరి ఇనలిన్‍ ఆ ఆజ్ఞానా తునా అప్పగించుకరేస్‍. 
ఎజాత్ను దిల్‍సాక్చిన థోడుజను ధకల్‍నాఖిదీన్‍ విష్వాస్‍ను విషయంమా ఝాజ్‍ పుట్టిజాయ్తె ఇనింతర ఛా 
ఇవ్నామా హుమెనైయున్‍బీ అలెక్సంద్రుడ్‍బీ ఛా అవ్నే నాదూషించునుతిమ్‍ షిక్చాపోందనటేస్‍ అవ్నా సైతాన్‍నాహాత్మ దినాఖిదిదో. 
