﻿యోహా.
8.
తెదె కిను ఘేర్కన ఇవ్నే చలీగు, పన్కి యేసు, ఒలీవలా పహాడ్‍కనా గయో! 
యేసు బుజేఏక్‍ ధనె వ్యానేకత్రేస్‍ ఫరీన్‍ దేవ్ని మందిర్‍మా ఆవమా అద్మి హాఃరు ఇనకనా ఆయూ ఇనటేకె ఇనే భేషీన్‍ ఇవ్నా బోధించుకరా. 
తెదె ధర్మషాస్ర్తంనా బోధించువాలు, షాస్ర్తుల్‍బీ పరిసయ్యుల్‍బీ, వ్యభిచార్‍కనా ధర్యుతే ఏక్ బాయికొ నా బులాలిఆయిన్‍ ఇన ఇచ్మా ఉభారి రాఖీన్‍. 
బోధకుడా, ఆ బాయికో వ్యభిచార్‍ కరుకరాతేదే, 
ఎజాత్ను వాలన ఫత్రాతి భిర్కైన్‍ మర్రాక్ను కరి మోషే ధర్మ షాస్ర్తంమా ఆజ్ఞాదిరాక్యోస్‍ కాహేనా? హుయుతోబీ థూ సాత్‍ బోలుకరస్‍? కరి ఇన పుఛాయ్యా. 
ఇన ఉప్పరస్‍ ఛాడి నాక్నుకరీ ఇనస్‍ ఖాహతావ్తూ అమ్నితర పుఛ్చాయు. పన్కి యేసు జుఖీన్‍ జమీన్‍ఫర్‍ అంగ్లితీ సాత్కీ లిఖ్కాలగూ. 
ఇవ్నే ఇనా బేందాకోయినితిమ్‍ బోలలాగమా యేసు మోడుపాడీన్‍ దేఖీన్‍ తుమారమా పాప్‍ కర్యుకోయింతె యో అగాడి ఇనఫర్‍ ఫత్రో నాకజాయి కరి ఇవ్నేతి బోలీన్‍ 
బుజు జుకిన్‍ మాటీపర్‍ లీఖాలగ్యూ! 
ఇవ్నే ఇని వాత్న ఖంజీన్‍ మోటా అద్మితూ నికీన్‍ అడ్డాణి లడ్కాలగు ఏక్ను కేడె ఏక్ బెందీన్‍ గయూ; యేసు ఎక్కస్‍జనో మిగ్లిగో యో బాయికో ఇచ్మా ఉబ్రీన్‍ రయ్యో. 
యేసునే ముడ్‍క్యూపాడిన్‍ ఆయా ఇవ్నే కేజ్గాఛా? కోన్‍బీ తున సిక్చ నాక్యుకోయిన్నా? కరి పుఛ్చాయుతెదె! 
యో బాయికొ కొయిని ప్రభూవా కరి బోలి అనటేకే యేసు మేబి తున సిక్చించు కొయిని; తూ జైన్‍ హంకేతు పాప్‍ నోకోకరిస్‍ కరి ఇనెతీ బోల్యొ. 
బుజు యేసు మే ములాక్న ఉజాళు, మన మారకెడె చాలవాలో యో అంధారమా చాల్సేకొయిని జీవంను ఉజాలు హుయిన్‍ ర్హాసేకరి ఇవ్నేతీ బోల్యొ. 
తెదె పరిసయ్యుల్‍ తారు థూస్‍ సాబుత్‍ బొల్లెంకరస్‍; తారు సాబుత్‍ హాఃఛికాహేకరి ఇనెతీ బోలమా. 
యేసునే మే కెజ్గాతూ ఆయోకి కెజ్గా జైయిస్కి సోచిరాక్యోస్‍; అనహాఃజె మారహాఃజె మేస్‍ సాబుత్‍ బోల్లిదొతోబి మారు సాబుత్‍ హాఃచ్ఛీస్‍; మే కెజ్గాతూ నికీన్‍ వాలంకురుస్కి, కెజ్గా జంకురస్కి తుమ్నామాలంకొయిని. 
తుమే ఆంగ్‍బట్టి న్యావ్‍ తీర్చుకరస్‍ 
పన్కి మే కినాబి న్యావ్ తీర్ఛీస్‍కొయిని, మే ఏక్జనో ర్హహీస్‍కొయినితింమ్‍ మేబీ, మన మొక్లొతె భా బీ ఛియ్యో అనటేకె మే బీ న్యావ్‍ తీర్చతోబి మారున్యావ్‍ హాఃఛిస్‍ 
బుజు బే అద్మిను సాబుత్‍ హాఃఛి తుమార ధర్మషాస్ర్తంమా లిఖ్కాయ్‍రూస్‍కాహేనా! 
మార గూర్చిన్‍ మే సాబుత్‍ బొల్లిలిదోత్‍; మన మొక్లొతె భా సబి మార గూర్చిన్‍ సాబుత్‍ బోలుకరస్‍కరి బోల్యొ. 
తెదె యేసు ఇవ్నేతి తారో భా కెజ్గఛాకరి పుఛ్చావమా; యేసు తుమే మనతోబి, భానతోబి మారో భాతోబి మాలంకరకోయిని; మన మాలం కర్యానా మార భానబి మాలంకర్చూ కరి ఇవ్నేతి బోల్యొ. 
ఇనే దేవ్ను మందిర్‍మా బోధాకర్తోర్హావమా పైసానకను పేట్టీనా జోగోమా ఆ వాతె బోల్యు, ఇను బాజను బుజుబి ఆయుకోయిని, పన్కి కోన్బీ అన ధర్లిదుకోయిని. 
బుజు ఏక్ వఖాత్‍ ఇనే, “మే ఛలోజంక్రుస్‍; తుమే మన ధూండ్సు పన్కి, తుమార పాప్ మాస్‍ రైయిన్‍ మార్జాసు; మే జైయిస్తే జొగోమా తుమే కోఆవ్సుని” కరి బోల్యొ. 
ఇనటెకె యూదుల్‍ అధికారల్‍ మే జేస్‍తే జోగోమా తుమే కోఆవుసునీ కరి యో బోలుకరస్‍నీ; ఇను యోస్‍ మరిజాసేనా కరి బొల్లిదు. 
తెదే యో, “తుమే ములక్నాసంబంధించుయుహు, అద్మి మే సర్గంనా సంబంధిహుయోహో; తుమే ములక్మా సంబందించుయుహు మే ములక్ను సంబందంహుయుతే కాహే. 
ఇనటెకె తూమరు పాపంమాతు తుమే మార్జాసు కరి తుమారేతి బోల్యోతొ, మే యోస్కరి తుమే విస్వాసం నాకర్యుతో తుమే తుమార పాప్‍ మతూస్‍ మర్జాసుకరి” ఇవ్నేతీ బోల్యొ. 
ఇనటేకె ఇవ్నే, తు కోన్కరి ఇన పుఛ్చావమా యేసు ఇవ్నేతి, అగాడీతీ మే తుమ్న కోన్కరి బోలుకరూస్కి మేస్కరి బోల్యొ. 
తుమ్నా లీన్‍ బోలనుబి న్యావ్‍ తీర్చానటెకెబి ఘాణు సంగతుల్‍ మన మాలం పన్కి మన బోలీమోక్లోతె యో హాఃచేలొ మే ఇనకనా ఖాంజ్యోతే సంగతుల్‍ నస్‍ ములక్‍నా బోధించుకరుస్‍ కరి బోల్యొ. 
భానలీన్‍ యో ఇవ్నేతి బోలుకరస్కరి ఇవ్నే మాలం కోకర్యాని. 
ఇనటెకె యేసు, తుమే అద్మినా ఛీయ్యోనా ఉపర్‍ పడ్యాతెదే యో మేస్‍కరీ, మారు మేస్‍ సాత్‍బీ కోకరిస్‍నీతిం భా మనా‍ సీకడ్యోతిమ్‍ ఆ సంగతుల్‍ బోలుకరూస్కరి తుమే మాలంకర్‍సు. 
మన బోలీమోక్లోతె యో మారకేడె ఛా! నచ్యుతే కార్యంనా మే కెదేబి కరిస్‍ ఇనటెకే యో మన ఎకేలోస్‍ కొబెంద్యొని కరి బోల్యొ. 
యో ఆ సంగతుల్‍నా బోల్తొ ర్హావమా కెత్రూకి జను ఇనపర్‍ విస్వాసం రాఖ్యూ. 
ఇనటేకె యేసు ఇనా నమ్యుతె యూదుల్మా తుమే “మారు బోధనా హాఃజీన్‍ రవ్వాలవుసేతో హాఃఛిమాస్‍ మార సిష్యుల్‍ హుయిన్‍ హాఃచినా మాలంకర్‍సూ; కరి బోల్యొ. 
తెదే యో హాఃఛిమాస్‍ తూమ్నా స్వతంత్రులనుగా కర్‍సేకరి” బోల్యొ. 
తెదె ఇవ్నే, హామే అబ్రాహామ్‍నా సంతానం హామే కెదేబీ కీనాబి దాసుడ్ హుయిన్‍ కోర్హయిని తుమే స్వతంత్రులనుగా రాసు కరి కిమ్‍ బోలుకరస్‍ కరి ఇనేతి బోల్యు. 
ఇనటేకే యేసు పాప్‍ కరిహుయు హార్యేక్జను పాప్న దాసుడ్‍ కరి తుమరేతి హాఃఛితి బోలుకరాస్‍ 
దాసుల్‍ కెదేబి ఘార్మా కోర్హయిని; ఛియ్యో హమేసాబి జివుంకరస్. 
ఛియ్యో తుమాన స్వతంత్రుల్గా కర్యుతో తుమే హాఃఛీమాస్‍ స్వతంత్రుల్‍ హుయిన్ రాసు. 
తుమే అబ్రాహామ్‍నా సంతానం కరి మన మాలం హుయుతోబీ తుమారమ మార వచన్న టెకే జోగో కొయిని, ఇనటేకె మన మర్రాకన దేఖూకరాస్‍ 
మే మార భాకన దేక్యోతే సంగతులస్‍ బోధించుకరుస్‍; యో ప్రకరమాస్‍ తుమే తుమారభా కన ఖాంజుతే ఇనస్‍ కరుకరాస్‍ ఇవ్నేతి బోల్యొ. 
ఇనటేకె ఇవ్నే ఇనేతి హామరో భా అబ్రాహామ్ను కరి బోల్యానీ; యేసు, “తుమే అబ్రాహామ్నా లడ్కా హుయాతో అబ్రాహామ్ను కర్యోతే క్రియాలస్‍ కర్సూ.” 
దేవ్నుకాంతు ఖాంజుతె హాఃఛినా తుమారేతి బోల్యోతె మనహంకెస్ తుమే మర్రాకన దేఖుకరస్నీ; అబ్రాహామ్ను ఇమ్‍ కోకర్యోని. 
తుమే తుమార భాన క్రియలస్‍ కరుకరాస్‍ కరి ఇవ్నేతి బోల్యొ; ఇనటేకె ఇవ్నే హామే వ్యభిచార్వాలా ఫైదాహుయాకాహే, “దేవ్‍ ఏక్కాస్‍ హామ్నా భా బుజు హామే ఇనా లడ్కా” బోలామ. 
యేసు ఇవ్నేతీ ఆమ్‍నీతర బోల్యొ; దేవ్‍ తుమరో భా హుయోతో తుమే మన ఫ్యార్‍కరసు; మే దేవ్‍కంతీ బయాలుదేరిన్‍ ఆయిరోస్‍ మారు మేస్‍ కోఆయోని, యో మన బోలిమోక్లో. 
తుమే కిమ్‍ మారువాతేనా మాలంకోకరని? తుమే మారు బోధనా ఖంజాను తుమ్నా సహనమ్‍ కొయిని? 
తుమే తుమార భాన వల భూత్‍ సంబందుల్‍; తుమార భాన ఆఖ్నా పురాకర్ను కరి కోరిలేవుంకరస్‍ జామానతి యో నరహంతకుడ్‍ హుయిన్‍ హాఃఛినాటెకె వుబీరోహుయో కాహే; ఇనమా హాఃఛీస్‍ కొయినీ యో ఛాడ్‍బోల్యా తెదె ఇను స్వభావమ్‍ ఛాలీన్‍ వాతె బోలస్‍; యో ఛాడ్‍ ఛాడ్న భాహుయిన్‍ ఛా. 
మే హాఃఛినస్‍ బోలుకరూస్‍ ఇనటెకె తుమే మన నమ్మా కొయినీ. 
మరామ పాప్ ఛాకరి తుమారమ కోన్‍ వతాల్‍సే? మే హాఃఛి బోలుకర్తో హుసేతో తుమేసే? మన నమ్మా కోనమ్యని. 
దేవ్నా సంభాధి హువ్వాలో దేవ్‍ను వాతేనా ఖంజాస్‍ తుమే దేవ్నా సంబంధుల్‍ కాహే ఇనటెకె తుమే కోఖంజానీ కరి బోల్యొ. 
ఇనటెకె యూదుల్‍ తూ సమరయుడ్నొ భూత్‍ ధర్యోతెవాలో కరి హమే బోల్యాతె వాత్‍ హఃఛిస్‍ కాహేనా. కరి ఇనేతి బోలామ. 
యేసు మే భూత్‍ ధర్యాక్యుతే వాలో కాహే, మార భాన ఘనాపరచా వాలో; తుమే మన అవమానం కాడుకరస్ కరి బోల్యొ. 
మే మార మహిమన ధూండుకురూ కోయిని; ధూండ్తోహుయిన్‍ న్యావ్‍ తీర్చావాలో ఏక్జను ఛా. 
ఏక్జనో మారివాతేనా పాట్టీన్చావాలు యో కెదేబి మారణ్నా కోదెక్సేనికరి తుమారేతి హాఃఛితి బోలుకరూస్‍ కరి ఉత్తరం బోల్యొ. 
ఇనటేకె యూదుల్‍ తూ భూత్‍ ధరాక్యోహుయోకరి హాంకే మాలంకర్యా; అబ్రాహామ్‍బి, ప్రవక్తాల్బీ మరీగయా; హుయితోబీ ఏక్జాను మారు వాత్‍ యో కెదేబి మారణ్నా కోదేక్సెనికరి తూ బోలుకరస్‍ 
అప్నో భా హుయోతే అబ్రాహామ్ను మరిజాస్‍ కాహేన; ప్రవక్తల్బీ మరిజాస్నీ తూ ఇవ్నేతీబీ గొప్పవాలోసూ? తూ తార దీల్‍ కోన్‍కరీ రైయిజంక్రస్‍కరి పుఛ్చాయా. 
ఇనటెకే యేసు, మారు మేస్‍ మహిమా పరిచీలిదోతో మారు మహిమాన విలువా కొయిని; హామారో దేవ్కరీ కినాలీన్‍ బోలుకరస్కీ, యో మారో భాస్‍ మన మహిమా పరుచుకరస్‍ 
తుమే ఇన మాలంకరకొయినీ, పన్కి యో మనా మాలం; యో మన మాలంకొయినీ కరి బోల్యొతొ తుమ్మారని తరాస్‍ మే జూటీవాలొహుయిస్‍ పన్కి, మే ఇన మాలంకర్యొ, ఇని వాత్‍ఫర్‍ మే ఛాలుకరూస్‍ 
తుమారో భా హుయోతె అబ్రాహామ్‍నా దేక్‍సు కరి ఘాను ఆనందింస్యు; యో దేఖీన్‍ ఖూషి హుసు కరి బోల్యొ. 
ఇనటెకె యూదులస్ తునా “వుజుబీ అఢైహ్ః వరహ్‍ఃబీకొయిని తూ అబ్రాహామ్‍నా దేక్యనా” కరి బోలమా. 
యేసు, “అబ్రాహామ్ను ప్హైదాహువనా అగాడ్తిస్‍ మె ఛావ్కరి తుమారేతి హాఃఛితి బోలుకరూస్కరి” బోల్యొ. 
ఇనటేకె ఇవ్నే ఇనవుపర్‍ ఫేకానటెకె ఫత్రోపాడ్యో, పన్కి యేసు లాపిన్‍ దేవ్ను మందిర్ మాతీ బాధర్‍ నికిలీజాస్‍. 
