﻿కీర్తనలు.
136.
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మంచివాడు. 
దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 
ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞత చెల్లించండి: 
మహాద్భుతాలు చేసేది ఆయన ఒక్కడే, 
ఆయన తన జ్ఞానం చేత ఆకాశాలను కలుగజేశారు, 
నీటిపై భూమిని పరిచిన దేవునికి స్తుతులు చెల్లించండి. 
మహాజ్యోతులను నిర్మించిన దేవునికి స్తుతులు, 
పగటిని ఏలడానికి సూర్యుని చేసింది ఆయనే, 
రాత్రిని యేలడానికి చంద్రుని, నక్షత్రాలను చేసిన దేవునికి స్తుతులు, 
ఈజిప్టు తొలిసంతానాన్ని ఆయన సంహరించారు, 
వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించారు, 
చేయి చాచి తన బలమైన హస్తంతో వారిని రప్పించింది ఆయనే, 
ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన దేవునికి స్తుతులు చెల్లించండి, 
దాని మధ్యలో నుండి ఇశ్రాయేలీయులను దాటించింది ఆయనే, 
ఫరోను, అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసింది ఆయనే, 
అరణ్యం గుండా తన ప్రజలను నడిపించిన దేవునికి స్తుతులు చెల్లించండి, 
గొప్పరాజులను పడగొట్టిన దేవునికి స్తుతులు చెల్లించండి, 
బలాఢ్యులైన రాజులను చంపింది ఆయనే 
అమోరీయుల రాజైన సీహోనును చంపింది ఆయనే, 
బాషాను రాజైన ఓగును చంపింది ఆయనే 
వారి దేశాన్ని వారసత్వంగా ఇచ్చింది ఆయనే, 
తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని వారసత్వంగా ఇచ్చింది ఆయనే, 
మనం దీనదశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంది ఆయనే, 
మన శత్రువుల నుండి మనల్ని విడిపించింది ఆయనే, 
ప్రతి జీవికి ఆహారం ఇచ్చేది ఆయనే, 
పరలోక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, 
