﻿కీర్తనలు.
117.
సమస్త దేశాల్లారా, యెహోవాను స్తుతించండి; సర్వజనులారా, ఆయనను కీర్తించండి. 
మన పట్ల ఆయన మారని ప్రేమ గొప్పది, ఆయన నమ్మకత్వం నిరంతరం నిలుస్తుంది. యెహోవాను స్తుతించండి. 
