﻿కీర్తనలు.
114.
ఇశ్రాయేలు ఈజిప్టు నుండి, యాకోబు పర భాష మాట్లాడే ప్రజలమధ్య నుండి బయటకు వచ్చాక, 
యూదా దేవునికి పరిశుద్ధాలయం అయ్యింది, ఇశ్రాయేలు ఆయన రాజ్యమైంది. 
అది చూసి ఎర్ర సముద్రం పారిపోయింది, యొర్దాను వెనుకకు తిరిగింది; 
పర్వతాలు పొట్టేళ్లలా, కొండలు గొర్రెపిల్లల్లా గంతులేశాయి. 
సముద్రమా, నీవెందుకు పారిపోయావు? యొర్దాను, నీవెందుకు వెనుకకు తిరిగావు? 
పర్వతాల్లారా, మీరు పొట్టేళ్లలా, కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లా ఎందుకు గంతులేశారు? 
ఓ భూమి, ప్రభువు సన్నిధిలో యాకోబు దేవుని సన్నిధిలో నీవు గడగడ వణకాలి. 
ఆయన బండను నీటి ఊటగా మార్చేవారు, చెకుముకి రాతిని నీటి బుగ్గగా మార్చేవారు. 
