﻿పరమ.
7.
రాకుమారీ, ఆ పాదరక్షల్లో నీ పాదాలెంతో అందంగా ఉన్నాయి నీ తొడల వంపులు శిల్పి మలిచిన ఆభరణాల్ల ఉన్నాయి. 
నీ నాభి గుండ్రటి కలశంలా ఉంది దానికెన్నడూ ద్రాక్షారసం కొరత లేకుండుగాక. నీ ఉదరం పద్మ వలయితమైన గోధుమ రాశిలా ఉంది. 
నీ స్తనాలు లేజవరాలైన జింక అప్పుడే కన్న కవల పిల్లల్లా ఉన్నాయి. 
నీ మెడ దంతపు గోపురంలా ఉంది నీ నేత్రాలు బాత్ రబ్బీన్ సరసన ఉన్న హెష్బోనులోని తటా కాల్లా ఉన్నాయి. నీ నాసిక దమస్కు దిక్కుకి చూచే లెబానోను శిఖరంలా ఉంది. 
నీ తల కర్మెలు పర్వతంలా, నీ తల నీలాలు పట్టుకుచ్చుల్లా వున్నాయి. నీ సుదీర్ఘ కేశాలు చూసిన రాజు కూడా నీ వశం అవుతాడు. 
నీవు అతిలోక సుందరివి! అత్యంత మనోహరివి! ప్రియదర్శినివి! అందమైన, ఆహ్లాదకరమైన యువతివి! 
నీవు తాళవృక్షంలా పొడుగరివి. నీ స్తనాలు తాటిపళ్ల గెలల్లా వున్నాయి. 
నాకు ఆ చెట్టుపైకి ఎక్కాలని, దాని మట్టలు పట్టాలని ఉంది. నీ స్తనాలు ద్రాక్షా గుత్తుల్లా నీ ఊపిరి ఆపిలు సువాసనలా ఉన్నాయి. 
నీ నోరు శ్రేష్టమైన ద్రాక్షారసంలా అది నీ నోట జాలువారి నిద్రాముద్రిత ప్రియుని అధరాలను స్పృజించే మధువులా ఉండాలి. 
నేను నా ప్రియునిదానను నన్నతను వాంఛిస్తాడు! 
ఓ నా ప్రియుడా రా, చేలల్లోకి పోదాము రా, పల్లెల్లో రేయి గడుపుదాము రా, 
పెందలకడ లేచి ద్రాక్షాతోటలకు పోదాము ద్రాక్షా తీగలు మొగ్గ తొడిగాయో లేదో ఆ మొగ్గలు విచ్చుకున్నాయో లేదో దానిమ్మ చెట్లు విరబూశాయో లేదో తనివితీరా చూద్దాము. రా. అక్కడ నేనిచ్చునా ప్రేమ అందుకొన రా. 
ప్రేమ వర్ధక మండ్రేక ఓషధుల్నీ మా గుమ్మాన వేలాడే పరిమళభరితమైన పువ్వుల్నీ చూడు! ఓ నా ప్రియుడా, నీకై దాచి ఉంచాను ఎన్నెన్నో పండువీ, దోరవీ పండ్లు తిని చూడు! 
