﻿కీర్తన..
140.
సంగీత నాయకునికి. దావీదు స్తుతి కీర్తన. యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. కృ-రుల నుండి నన్ను కాపాడుము. 
ఆ మనుష్యులు కీడు పనులు చేయాలని ఆలోచిస్తున్నారు. వాళ్లు ఎల్లప్పుడూ కొట్లాటలు మొదలు పెడ్తారు. 
వారి నాలుకలు విషసర్పాల నాలుకల్లాంటివి వారి నాలుక క్రింద సర్పవిషం ఉంది. 
యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. కృ-రుల నుండి నన్ను కాపాడుము. ఆ మనుష్యులు నన్ను తరిమి, బాధించుటకు ప్రయత్నిస్తారు. 
ఆ గర్విష్ఠులు నా కోసం ఉచ్చు పెడతారు. నన్ను పట్టుకొనేందుకు వాళ్లు వల పన్నుతారు. నా దారిలో వారు ఉచ్చు పెడతారు. 
యెహోవా, నీవు నా దేవుడవని నీతో చెప్పుకొన్నాను. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. 
యెహోవా, నీవు నాకు బలమైన ప్రభువు. నీవు నా రక్షకుడవు. నీవు ఇనుప టొపివలె యుద్ధంలో నా తలను కాపాడుతావు. 
యెహోవా, ఆ దుర్మార్గులు కోరినట్టుగా వారికి జరగనివ్వవద్దు. వారి పథకాలు నెగ్గనీయకు. 
యెహోవా, నా శత్రువులను గెలువనియ్యకుము. ఆ మనుష్యులు చెడు కార్యాలు తల పెడుతున్నారు. అయితే ఆ చెడుగులు వారికే సంభవించునట్లు చెయుము. 
వాళ్ల తలలమీద మండుచున్ననిప్పులు పోయుము. నా శత్రువులను అగ్నిలో పడవేయుము. వారు ఎన్నటికీ ఎక్కిరాలేని గోతిలో వారిని పడవేయుము. 
యెహోవా, ఆ అబద్దికులను బతుకనియ్యకుము. ఆ దుర్మార్గులకు చెడు సంగతులు జరుగనిమ్ము. 
పేదవాళ్లకు యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడని నాకు తెలుసు. నిస్సహాయులకు దేవుడు సహాయం చేస్తాడు. 
యెహోవా, మంచి మనుష్యులు నీ నామాన్ని స్తుతిస్తాను. నీ సన్నిధానంలో వారు నివసిస్తారు. 
