﻿కీర్తన..
134.
యాత్ర కీర్తన. యెహోవా సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి! రాత్రి అంతా ఆలయంలో సేవించిన సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి. 
సేవకులారా, మీ చేతులు ఎత్తి యెహోవాను స్తుతించండి. 
యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక! యెహోవా ఆకాశాన్ని, భూమిని చేశాడు. 
