﻿కీర్తన..
131.
యాత్ర కీర్తన. యెహోవా, నేను గర్విష్ఠిని కాను. నేను ప్రముఖుడిని అన్నట్టు ప్రవర్తించ ప్రయత్నించను. నేను గొప్ప పనులు చేయాలని ప్రయత్నించను. నాకు మరీ కష్టతరమైన వాటిని గూర్చి నేను చింతించను. 
నేను మౌనంగా ఉన్నాను. నా ప్రాణం నెమ్మదిగా ఉంది. తల్లి చేతుల్లో సంతృప్తిగా ఉన్న ఒక శిశువులా నా ప్రాణం మౌనంగా, మ్మదిగా ఉంది. 
ఇశ్రాయేలూ, యెహోవానే నమ్ముకో. ఇప్పుడు ఆయనను నమ్ముకో, ఎప్పటికీ ఆయన్నే నమ్ముకో. 
