﻿ఎజ్రా.
2.
వీళ్లు బబులోను రాజ్యంలో నిర్బంధం నుంచి తిరిగి వచ్చినవాళ్లు. గతంలో బబులోను రాజైన నెబుకద్నెజరు వీళ్లని బందీలుగా పట్టుకొని, బబులోనుకు తెచ్చాడు. ఇప్పుడు వాళ్లు యెరూషలేముకు, యూదాకు తిరిగివచ్చారు. వాళ్లు తమతమ సొంత పట్టణాలకి తిరిగి వెళ్లారు. 
జెరుబ్బాబెలుతో పాటు తిరిగివచ్చిన వాళ్లలో యేషూవా, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా అనే వాళ్లున్నారు. బబులోను నుంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్ల జాబితా, వాళ్ల సంఖ్యల వివరం ఇది: 
పరోషు వంశస్థులు 2,172 
షెపట్యా వంశస్థులు 372 
అరహు వంశస్థులు 775 
యెషూవ, యోవాబు వంశాలకి చెందిన పహత్మోయాబు, మోయాబు వంశస్థులు 2,812 
ఏలాము వంశస్థులు 1,254 
జత్తూ వంశస్థులు 945 
జక్కయి వంశస్థులు 760 
బానీ వంశస్థులు 642 
బేబై వంశస్థులు 623 
అజ్గాదు వంశస్థులు 1,222 
అదొనీము వంశస్థలు 666 
బిగ్వయి వంశస్థులు 2,056 
అదీను వంశస్థులు 454 
అటేరు వంశస్థులు (హిజ్కియా కుటుంబం) 98 
బెజయి వంశస్థలు 323 
యోరా వంశస్థలు 112 
హాషుము వంశస్థులు 223 
గిబ్బారు వంశస్థులు 95 
బెత్లెహేము పట్నానికి చెందినవాళ్లు 123 
నెటోపా పట్టణం వాళ్లు 56 
అనాతోతు పట్టణంవాళ్లు 128 
అజ్మావెతు పట్టణంవాళ్లు 42 
కిర్యాతారీము, కెఫీరా, బెయేరోతు పట్టణాల వాళ్లు 743 
రమా, గెబా పట్టణాలవాళ్లు 621 
మిక్మషు పట్టణం వాళ్లు 123 
బేతేలు, హాయి పట్టణంవాళ్లు 222 
నెబో పట్టణంవాళ్లు 52 
మగ్బీషు పట్టణంవాళ్లు 156 
ఏలాము అనే మరో పట్టణంవాళ్లు 1,254 
హారీము పట్టణంవాళ్లు 320 
లోదు, హదీదు, ఓనో పట్టణాలవాళ్లు 725 
యెరికో పట్టణంవాళ్లు 345 
సెనాయా పట్టణంవాళ్లు 3,630 
యాజకులు: యెషూవ కుటుంబానికి చెందిన యెదాయ వంశస్థులు#973 
ఇమ్మేరు వంశస్థులు#1,052 
పషూరు వంశస్థులు#1,247 
హారీము వంశస్థులు#1,017 
ఇప్పుడిక లేవీయులలో హోదవ్యా కుటుంబానికి చెందిన యేషూవా, కద్మీయేలు వంశస్థులు#74 
గాయకుల జాబితా: అసాపు వంశస్థులు#128 
దేవాలయపు ద్వారపాలకుల వంశస్థులు షల్లూము, ఆటేరు, టల్నోను, అక్కూబు, హటీటా, షోబయి వంశస్థులు#139 
దేవాలయపు ప్రత్యేక సేవకుల వంశస్థులు జీహా, హశూపా, టబ్బాయోతు, 
కేరోసు, సీయహా, పాదోను, 
లెబానా, హగాబా, అక్కూబు, 
హాగాబు, షల్మయి, హానాను, 
గిద్దేలు, గహరు, రెవాయా, 
రెజీను, నెకోదా, గజ్జాము, 
ఉజ్జా, పాసెయ, బేసాయి, 
అస్నా, మెహూనీము, నెపూసీము, 
బక్బూకు, హకూపా, హర్హూరు 
బజ్లీతు, మెహీదా, హర్షా 
బర్కోసు, సీసెరా, తెమహు 
నెజీయాహు, హటీపా, 
సొలొమోను సేవకుల వంశస్థులు: సొటయి, సోపెరెతు, పెరూదా, 
యహలా, దర్కోను, గిద్దేలు, 
షెపట్య, హట్టీలు, పొకెరెతు, జెబాయీము మరియు అమి 
దేవాలయసేవకులూ, మరిము సొలొమోను సేవకుల వంశస్థులు కలిసి మొత్తుం#392 
తేల్మెలహు తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు పట్టణాలనుంచి యెరూషలేముకు కొందరు వచ్చారు. అయితే వీళ్లు తమ కుటుంబాల వాళ్లయిన ఇశ్రాయేలీయుల కుటుంబాలకు చెందినవాళ్లమని నిరూపించుకో లేకపోయారు. వాళ్లెవరంటే, 
దెలాయ్యా, టోబీయా, నెకోదా సంతతివారు మొత్తం 652 
యాజకుల కుటుంబాలకు చెందిన ఈ క్రింది వంశస్థులు వున్నారు: హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి వంశస్థులు. (గిలాదుకు చెందిన ఒకడు బర్జిల్లయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతను బర్జిల్లయి సంతతివాడిగా పరిగణించబడ్డాడు.) 
వీళ్లు తమ వంశ చరిత్రకోసం గాలించారు. కానీ అది వాళ్లకి లభ్యం కాలేదు. వాళ్ల పేర్లు యాజకుల జాబితాలో నమోదు కాలేదు. తమ పూర్వీకులు యాజకులని వాళ్లు నిరూపించ లేకపోయారు. దానితో, వాళ్లు యాజకులగా సేవ చేయలేకపోయారు. 
వాళ్లు ప్రతిష్ఠితమైన వస్తువులను తినకూడదని రాజ్యాధిపతి ఆజ్ఞ జారి చేశాడు. ఒక యాజకుడు ఊరీము, తుమ్మీము ధరించి, ఏమి చేయాలని దేవుణ్ణి అడిగేంతవరకు వాళ్లు ప్రతిష్ఠితమైన వస్తువులేమీ తినలేకపోయారు. 
మొత్తంమీద తిరిగివచ్చిన ఆ వంశంలో 42,360 మంది వున్నారు. వాళ్లలో 7,337 మంది స్త్రీ, పురుష సేవకులను పరిగణలోకి తీసుకోకపోతే తేలిన సంఖ్య ఇది. వాళ్లతో 200 మంది గాయనీ గాయకులు కూడా వున్నారు. 
వాళ్లకి 736 గుర్రాలు, 245 కంచర గాడిదలు, 435 ఒంటెలు, 6,720 గాడిదలు ఉన్నాయి. 
ఆ వంశం యెరూషలేములోని దేవుని ఆలయానికి చేరుకుంది. తర్వాత కుటుంబ పెద్దలు దేవాలయ నిర్మాణం కోసం తమ కానుకలు సమర్పించారు. పాత దేవాలయం నేలమట్టము చేయబడిన చోటనే కొత్త దేవాలయ నిర్మాణానికి వాళ్లు సమకట్టారు. 
వాళ్లు దేవాలయ నిర్మాణానికి తమ శక్తి కొద్దీ కానుకలు ఇచ్చారు 1,100 పౌనుల బంగారం, 3 టన్నుల వెండి, యాజకులు ధరించే 100 దుస్తులు వాళ్లు ఇచ్చారు. 
ఈ విధంగా యాజకులు, లేవీ గొత్రీకులు, తదితరులు కొంతమంది యెరూషలేముకి, దాని చుట్టూవున్న ప్రాంతాలకీ చేరుకున్నారు. ఈ వంశంలో దేవాలయ గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ సేవకులు వున్నారు. తదితర ఇశ్రాయేలీయులు తమతమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు. 
