﻿మత్తయి రాసిలా యేసుక్రీస్తురొ సువార్త.
1.
యేసు క్రీస్తు వంసావలి యాకిరి రొయితవ్వి, ఎయ్యె దావీదు రొజా యింకా అబ్రాహాము వంసంలింకు చెందిలాలింకె. 
అబ్రాహాము పో ఇస్సాకు. ఇస్సాకు పో యాకోబు. యాకోబు పో యూదా ఈనె తా అన్నబయినె. 
యూదా తామారు వల్లరె పో పెరెసు ఈనె జెరహు. పెరసు పో ఎస్రోము పో ఆరాము 
ఆరాము పో అమ్మీనాదాబు. అమ్మీనాదాబు పో నయస్సోను. నయస్సోను పో సల్మాను 
సల్మాను పో బోయజు. బోయజు మా రాహాబు. బోయజు పో ఓబేదు. ఓబేదు మా రూతు. ఓబేదు పో యెస్సయి. 
యెస్సయి పో రొజా యిలా దావీదు. దావీదు పో సొలొమోను. 
సొలొమోను పో రెహబాము. రెహబాము పో అబీయా. అబీయా పో ఆసా. 
ఆసా పో యెహోసాపాతు. యెహోసాపాతు పో యెహోరాము. యెహోరాము పో ఉజ్జియా. 
ఉజ్జియా పో యోతాము. యోతాము పో ఆహాజు. ఆహాజు పో హిజ్కియా. 
హిజ్కియా పో మనస్సే తా పో ఆమోను. ఆమోను పో యోసియా. 
యోసియా పో యెకొన్యా ఈనె తా బయినె. యంకె తల్లాబెల్లె ఇస్రాయేలీయులు బబులోను గాకు బందీలుగా రొయితవ్వె. 
బబులోను గాకు జెల్లా తరవాతరె వంసం యాకిరి అచ్చి, యెకొన్యా పో సయల్తీయేలు. సయల్తీయేలు పో జెరుబ్బాబెలు. 
జెరుబ్బాబెలు పో అబీహూదు. అబీహూదు పో ఎల్యాకీము. ఎల్యాకీము పో అజోరు. 
అజోరు పో సాదోకు. సాదోకు పో ఆకీము. ఆకీము పో ఎలీహూదు. 
ఎలీహూదు పో ఎలియాజరు. ఎలియాజరు పో మత్తాను. మత్తాను పో యాకోబు. 
యాకోబు పో యోసేపు. యోసేపు నెయిపొ మరియ. మరియ పో యేసు. తాకు క్రీస్తు బులుసె. 
ఈనె అబ్రాహాము దినోనె దీకిరి దావీదు జాంక పద్నాలుగు తరాలు. దావీదు తీకిరి యూదునె బబులోను గాకు బందీలుగా తల్లా దినోనె జాంక పద్నాలుగు తరాలు. బబులోను చెరకు జెల్లా దినోనె దీకిరి క్రీస్తు వరుకు పద్నాలుగు తరాలు. 
యేసు క్రీస్తు జొర్నైవురొ యాకిరి అచ్చి, యేసు క్రీస్తు మా మరియకు, యోసేపు బుల్లా మనమ సంగరె ప్రదానమైకిరి అచ్చి. బ్యా కు అగరె పురువు ఆత్మసక్తి సంగరె మరియ పెట్టొ సంగరె అచ్చి. 
ఈనె తా గొయిత యోసేపు బొల్టమనమ సడకు సెయ్యె తాకు సార్లింకె బిత్తరె అవమానం కొరిలాని. కాకు నా బుజ్జికుంటా తాకు సడదిమ్మంచి బులిగిచ్చి. 
సెయ్యె సా బులిగిల్లా తరవాతరె, దేవదూత తాకు సొప్నొరె దిగదీకిరి, దావీదు పో యీలా యోసేపు మరియ పురువు ఆత్మ సంగరె పనిదీగిచ్చి. తాకు తో నెయిపొగా అంగీకరించితె దొరితెనా. 
మరియ జొనె వొండ్ర పోకు జొర్నొదూసి. సెయ్యె తా మనమానుకు తంకు పాపోనె దీకిరి రక్సించుసి. సడకు తాకు యేసు బులికిరి నా లొగు బులి కొయిసి. 
ప్రబువు తా ప్రవక్త సంగరె పలికిలా కొతా నెరవేరిలాపనికిరి యడల్లా జరిగిసి. 
ఈనె కన్యక పనిదీగికిరి వొండ్ర పోకు జొర్నొదూసి. తంకె తాకు ఇమ్మానుయేలు బులి నా సంగరె డక్కుసె. “ఇమ్మానుయేలు బుల్నే పురువు అముకు తోడు బులి అర్దం.” 
యోసేపు గుమ్మొదీకిరి ఉటికిరి దేవదూత తాకు ఆజ్ఞాపించిలాపని కొరిసి. మరియకు బ్యా కొరిగీకిరి తా గొరొకు కొనిగీకిరి జేసి. 
ఈనె, సెయ్యె పో జొర్నైలా జాంక మరియ దీకిరి మిసిలాని. సెయ్యె సే వొండ్ర పోకు “యేసు” బులి నా లొగిసి. 
