﻿లూకా.
4.
దేముడుచి సుద్ది తిలి ఆత్మ యేసుచి పెట్టి బెర తా, జో యోర్దాను గాడు పక్క ముల దా, జా ఆత్మ జోక పెలవ నెతికయ్, ఒత్తల్‍తొచి బయిలు దేసిమి గెచ్చ, ఒత్త బుల్తె తిలన్. 
జా డొంగుర్ దేసిమి దొన్ని విస్సొ దీసల్ తిలన్‍క సయ్‍తాన్ జోక పాపుమ్ కెరవుక మెన ఉచర, జా దొన్ని విసొ దీసల్ అల్లర్ కెర్తె తిలన్. జేఁవ్ దొన్ని విసొ పొదుల్ గెతికయ్, యేసుక చూ కెర్లి. 
తెదొడి సయ్‍తాన్ యేసుతె జా కెర జోక, “తుయి దేముడుచొ పుత్తుసి జలె, ఈంజొ పత్తురు పోడియొ జతి రితి సంగు” మెలన్. 
యేసు జోక ఇసి సంగిలన్, “మాములుమ్ పోడిచి సెక్తి తెన్ మాన్సుల్ జితి నాయ్. దేముడుచి కొడొతె రెగ్డ అస్సె.” మెలన్. 
తెదొడి సయ్‍తాన్ యేసుక ఒగ్గర్ డోంకుతె కడ నా కెర, ఎక్కి నిమ్సుమ్‍కయ్ జోక ఒండి లోకుమ్‍చ రాజిమ్‍లు దెకవ కెర, 
“ఈంజ ఎత్కిచి ఉప్పిరి ఏలుప కెర్తి అదికారుమ్, ఈంజేఁవ్ రాజిమ్‍లు ఎత్కితె తిలిస్‍చి గవురుమ్ తుక దెయిందె. ఈంజ ఎత్కి అంచి అత్తి అస్సె, కక్క దెయిందె గే అంచి ఇస్టుమ్. 
జాక, తుయి అంక జొకర్లెగిన, తుకయ్ దెయిందె” మెన సయ్‍తాన్ సంగిలన్. 
దస్సి సంగితికయ్, యేసు ఇసి మెన జబాబ్ దిలన్, “ప్రబు జలొ తుమ్‍చొ దేముడుకయ్ తుమ్ జొకర. జో ఎక్కిలొచి సేవ తుమ్ కెరుక అస్సె. మెన దేముడుచి కొడొతె రెగ్డ అస్సె.” 
తెదొడి సయ్‍తాన్ యేసుక యెరూసలేమ్ పట్నుమ్‍తె కడ నా కెర, దేముడుచి గుడిచి వెన్గొపుచి ఉప్పిరి జోక టీఁవడ కెర, ఇసి మెలన్, “తుయి దేముడుచొ పుత్తుసి జలె, ఎట్టొతొ డేఁవు. 
కిచ్చొక మెలె, తుయి ప్రమాదుమ్ నే జతి రితి జోచ దూతల్‍క దేముడు ఆడ్ర దా తెద్రయెదె 
తుచ చట్టొ పత్రె నే లయితి రితి జేఁవ్ దూతల్ జోవయించ అత్తొ చంపొ కెర తుక ఉక్కులనుల, మెన దేముడుచి కొడొతె రెగ్డ అస్సె” మెన సయ్‍తాన్ సంగిలన్. 
యేసు జోక, “ప్రబు జలొ తుమ్‍చొ దేముడుక పరిచ్చ కెరుక నాయ్ మెన దేముడుచి కొడొతె సంగ అస్సె” మెన యేసు జబాబ్ దిలన్. 
జలె, సయ్‍తాన్ జేఁవ్ అల్లర్ కెర్త, పరిచ్చ కెర్త కొడొ సంగ కేడవ కెర, ‘అన్నె కెఁయఁక గే అవ్‍కాసుమ్ అయ్‍లె, అన్నె దస్సి అల్లర్ కెరిందె’ మెనయ్ ఉచర, ఉట్ట గెలన్. 
జలె, అబ్బొస్‍చి జోచి దేముడుచి సుద్ది తిలి ఆత్మ పెలవ నెతికయ్ యేసు జో వడ్డిలి గలిలయ ప్రాంతుమ్‍తె అన్నె గెలన్, చి జా ప్రాంతుమ్ ఎత్కితెచ సుట్టునంతచ గఁవ్విలె జోచి రిసొ ఎత్కిజిన్ సూన్ల. 
అన్నె, జా ప్రాంతుమ్‍చ యూదుల్‍చ సబ గెరల్ ఎత్కితె బోదన కెర్తె తిలన్, చి ఎత్కిజిన్ జోచి గవురుమ్ సంగితె తిల. 
జో బాల తతె తెంతొ వడ్డిలి ఒత్తచి నజరేతు గఁవ్వి యేసు అయ్‍లన్, అన్నె, సెలవ్ కడన్లి దీసి యూదుల్‍చి సబ గెరలె గెలన్. రోజుక సెలవ్ కడ దీసి దస్సి సబగేరి గెచ్చుక జోక అలవాట్. జలె, జయ్యి దీసి ఒత్తచి సబగేరి గెచ్చ కెర, దేముడుచి కొడొ సదు కెరుక మెన టీఁవిలన్. 
జలె, దేముడుచ కబుర్లు సంగిలొ యెసయా పుస్తకుమ్‍తెచి కొడొ సదు కెర్సు మెన జోచి అత్తి దిల, చి జా ఉగ్డ కెర, సదు కెర సూనయ్‍లన్. 
“దేముడుచి సుద్ది తిలి ఆత్మ అంచి పెట్టి అస్సె. బీద సుదల్‍క సుబుమ్ కబుర్ ఆఁవ్ సూనయ్‍తి రిసొ జో జోవయించి ఆత్మసెక్తి అంచి బోడి సువ దా అదికారుమ్ దా అస్సె. జేలి జలస విడ్దల్ జతిసి ఆఁవ్ సాట్ప కెర్తి రితి, పడ్తొ గుడ్డి జలస అన్నె దెకితిస్‍చి రిసొ ఆఁవ్ సాట్ప కెర్తి రితి, అన్నె మాన్సుల్ నిస్కారుమ్ కెర్త మాన్సుల్‍చ బాదల్ ఆఁవ్ పిట్టవ దస బాదల్ తెంతొ విడ్దల్ కెర్తి రిసొ, 
‘ఎత్కి అదికారుమ్ తిలొ దేముడు ప్రబు జోచి దయ మాన్సుల్‍క దెకయెదె’ మెన ఆఁవ్ సాట్ప కెర్తి రిసొయి జో అంక తెద్రవ అస్సె” మెన దేముడుచ కబుర్లు సంగిలొ యెసయాచి అత్తి రెగిడ్లి కోడు యేసు సదు కెర సూనవ కెర, 
జా పుస్తకుమ్ డంప కెర, జా సబగేర్‍చొ సేవ కెర్తొస్‍క అన్నె దా కెర, అన్నె వెసిలన్. జా సబగేరి తిలస ఎత్కిజిన్ జోక చెంగిల్ దెకితె తిల. 
తెదొడి జోవయింక, “దేముడుచి కొడొతెచ ఆఁవ్ అప్పె తుమ్‍క సూనయ్‍ల కొడొ ఆజి ఎత్కి జర్గు జంక దెర అస్తి” మెన సంగిలన్. 
తెదొడి, “చెంగిలొ మాన్సు, ఈంజొ సంగిల కొడొ నిజుమి సత్తిమ్‍చ” మెన జేఁవ్ ఆచారిమ్ సంగ తా, “గని ఈంజొ యోసేపుచొ పుత్తుసి, నెంజె గె?” మెన అన్నె ఇదిల్ అన్మానుమ్ జా సంగిల. 
జలె, యేసు జోవయించి బుద్ది జాన కెర, జోవయింక అన్నె, “డాక్టర్, తుకయ్ తూయి చెంగిల్ కెరను” మెంతె అంక, అన్నె “కపెర్నహూమ్ పట్నుమ్‍తె ఇస దస వెల్లెల కమొ కెర్లన్ మెన తుచి రిసొ సూన అస్సుమ్. ఇన్నె కి తుచి సొంత దేసిమి దస కమొ కెరు మెన అంక సంగితె, కిచ్చొగె?” 
అన్నె, “తుమ్‍క ఆఁవ్ కిచ్చొ కచితుమ్ సంగితసి మెలె, దేముడుచ కబుర్లు సంగితొ కేన్ మాన్సుక కి జోచి సొంత దేసిమ్‍చ మాన్సుల్ ఇస్టుమ్ జతి నాయ్” మెలన్. 
గని తుమ్‍క ఆఁవ్ కిచ్చొ మెంతసి మెలె, ఏలీయా పూర్గుమ్‍చొ తిలి పొది, తిన్ని వెర్సుల్ నర పూర్తి కిచ్చొ పాని పెటె నాయ్. చి ఒండి దేసిమి ఒగ్గర్ కరు జా గెలి. జలె, అమ్‍చ ఇస్రాయేలుల్ అమ్ యూదుల్ మొత్తుమ్‍తె జా పొది ఒగ్గర్‍జిన్ రండెలివొ తిల. 
గని జేఁవ్ మొత్తుమ్‍జిన్‍తె ఎక్లితె కి దేముడు ఏలీయాక తోడు తెద్రయె నాయ్. సీదోను ప్రాంతుమ్‍చి సారెపతు గఁవ్విచి రండెలి ఎక్లితె జోక తోడు తెద్రయ్‍లొ. 
పడ్తొ, దేముడుచ కబుర్లు సంగిలొ ఎలీషాచి కాలుమ్ అమ్‍చ ఇస్రాయేలుల్‍తె వెల్లి రోగుమ్ దెర్ల మాన్సుల్ ఒగ్గర్‍జిన్ తిల. జలె, జోవయింతె కో కి చెంగిల్ జతి నాయ్. గని సిరియ దేసిమ్‍చొ అమ్‍చొ యూదుడు నెంజిలొ నయమానుయి చెంగిల్ జలొ; యేసు సంగిలన్. 
జలె, యూదుల్‍క నాయ్, గని వేర దేసిమ్‍చక దేముడు చెంగిల్ కెరయ్‍లిస్‍చి రిసొ యేసు సంగిలిసి సూన కెర, జా సబ గెరితె తిల యూదుల్ ఎత్కిజిన్‍క ఒగ్గర్ కోపుమ్ అయ్‍లి. 
జేఁవ్ ఉట్ట జా, యేసుక పట్నుమ్ తెంతొ ఉదడ కెర, జోవయించి పట్నుమ్ టీఁవిలి మెట్టచి కొసా ఎద ఉదడ్ల; ‘ఒత్త తెంతొ గలి జవుస్’ మెన సేడయ్‍తి రిసొ, 
గని యేసు ప్రమాదుమ్ నే జతె జోవయించి నెడిమి తెంతొ బార్ జా జో గెచ్చుక ఉచర్లి వాట్‍క గెలన్. 
తెదొడి జా గలిలయ ప్రాంతుమ్‍చి కపెర్నహూమ్ పట్నుమ్‍తె యేసు ఉట్ట గెచ్చ, సెలవ్ కడన్లి దీసి మెన, సబగేరి గెచ్చ జా పట్నుమ్‍చ యూదుల్‍క బోదన కెర్లన్. 
దేముడు దిలి అదికారుమ్ కొల్ది బోదన కెర్తె తతికయ్, జనాబ్ ఆచారిమ్ జల. 
జలె, జేఁవ్ తిలి సబ గెరి బూతుమ్ దెర్లొ ఎక్కిలొ తిలొ. జో జలె, గట్టిఙ అవాడ్ కెరన కిచ్చొ మెన కేక్ గలన్ మెలె, 
“ఓ నజరేతు గఁవ్విచొ యేసుప్రబు, అమ్‍చి తెన్ తుక కిచ్చొ? అమ్‍క పాడ్ కెరుక జా అస్సిస్ గె? తుయి కొన్సొ గే ఆఁవ్ జాని. తుయి దేముడుచి సుద్ది తిలొసొ తుయి, అమ్‍క ములు” మెన కేక్ గల సంగిలొ. 
యేసు, జలె, “తుక్లె తా ఇన్నెక ముల దా గో!” మెన జో మాన్సుక దెర్లి బూతుమ్‍క గోల కెర్లన్. గోల కెర్తికయ్, ఎత్కిజిన్‍చి నెడిమి బూతుమ్ జో మాన్సుక సేడవ దా, జోక ప్రమాదుమ్ నే కెర్తె జోతె తెంతొ బార్ జలన్. 
జర్గు జలిసి ఎత్కిజిన్ దెక ఎక్కిలొక ఎక్కిలొ, “ఇన్నెచి కోడు కిచ్చొ అదికారుమ్‍చి? బూతల్‍క గో! మెన ఆడ్ర దెతయ్, చి జేఁవ్ బార్ జా గెతతి” మెన ఆచారిమ్ జా సంగిల. 
జా దీసి తెంతొ ఒండి ప్రాంతుమ్‍తె జో కెర్ల కమొచి రిసొ జాన్‍ల. 
జలె, యేసు ఉట్ట సబ గెరి తెంతొ బార్ జా సీమోనుచి గెరి గెలన్. జలె, సీమోనుచి అత్తస్‍క జొర్జొ తా ఆఁగ్ ఒగ్గర్ తాత్ తతికయ్, జాక “చెంగిల్ కెరు” మెన జేఁవ్ బతిమాల్ప జా సంగిల, చి 
యేసు జాచి పాసి టీఁవ జొర్జోక గోల కెర్తికయ్, జొర్జొ చట్కున గెలి, చి బేగి జా ఉట్ట కెర, జేఁవ్‍క సవ్రెచన కెర్లి. 
జా సంజె పొద్దు గెతె తతికయ్, కచ మాన్సుల్‍క కిచ్చొ కిచ్చొ జొర్జొల్ తిల గే, యేసుతె జోవయింక కడ ఆన్ల, చి జోవయింతె ఎత్కి మాన్సుక చడ, చెంగిల్ కెర్లన్. 
అన్నె, ఒగ్గర్‍జిన్ మాన్సుల్ తెంతొ బూతల్ బార్ జా, “తుయి, దేముడుచొ పుత్తుసి.” మెన కేక్ గల. గని జేఁవ్ బూతల్‍క యేసు గోల కెర్లన్, అన్నె జేఁవ్ లట్టబుక సెలవ్ దెయె నాయ్. కిచ్చొక మెలె, జోక ‘క్రీస్తుయి’ మెన జేఁవ్ జాన్లి రిసొ. 
రాత్ పాయితికయ్, యేసు బార్ జా కోయి నెంజిలి టాన్‍తె గెలన్, గని ప్రెజల్ జోక చజన జోతె అయ్‍ల, చి “అమ్‍క ముల దా గో నాయ్” మెన జో ఉట్ట గెచ్చుక అడ్డు కెర్క దెకిల. 
జో జోవయింక, “దేముడుచి రాజిమ్‍చి రిసొచి సుబుమ్ కబుర్ ఆఁవ్ అన్నె తిల పట్నాల్‍తె కి సూనపుక అస్సె. ఈంజయ్ కామ్‍కయ్ దేముడు అంక తెద్రవ అస్సె.” మెన జబాబ్ దిలన్. 
జలె, యూదయ దేసిమ్‍చ సబ గెరలె బుల బుల యేసు బోదన కెర్తె తిలన్. 
